¡Sorpréndeme!

అంగరంగ వైభవంగా పెన్నఅహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహ స

2025-05-16 3 Dailymotion

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam In Pennahobilam:అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహోత్సవాలు జరిగాయి. ఈ బ్రహోత్సవాలలో భాగంగా గరుడ వాహనోత్సవం, శ్రీవారి కల్యాణోత్సవం కనుల విందుగా భక్తజనం తిలకించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనోత్సవం, శ్రీవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. గరుడ వాహనోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఆలకరించిన శ్రీదేవి,భూదేవి సమేత నరసింహ స్వామి ఉత్సవమూర్తులకు ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ కొండ కిందకు స్వామి వారిని తీసుకు వచ్చారు. నరసింహ స్వామి గరుడ వాహనంపై కొలువు దీర్చి ప్రధాన ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ ఉత్సాహల్లో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నాురు. ఆలయ అధికారులు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.