Miss World Contestants Heritage Walk : మిస్‌వరల్డ్ పోటీల ముద్దుగుమ్మలు హైదరాబాద్ చారిత్రక ప్రాంతాల్లో సందడి చేశారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్‌తో అలరించారు. మర్ఫా బ్యాండ్‌తో స్వాగతం పలికారు. లాడ్‌బజార్‌లో సుందరీమణులు గాజులు, ఇతర వస్తువులు కొనుగోలుచేశారు.
హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్న 109 మంది ముద్దుగుమ్మలు : 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌లోని చారిత్రక ప్రాంతాల్లో అలరించారు. ముందుగా 109మంది పోటీదారులు నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పాతబస్తీలో పాపులర్ అయినా మార్ఫా వాద్యాలతో వీరికి స్వాగతం పలికారు. అనంతరం ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకుని బృందాల వారీగా హెరిటేజ్ వాక్ చేశారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాన్స్‌లు చేస్తూ హుషారెత్తించారు.