TEACHERS TRANSFERS IN AP: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే 31ని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు.