Sri Bhadrakali Veerabhadra Swamy Temple : పాకిస్తాన్‌పై జరుగుతున్న యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని యావత్ భారతదేశ ప్రజలు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తూ, పూజలు చేస్తున్నారు. భారత రక్షణ దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.