AP Liquor Scam Updates : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ మేరకు సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం మెమో దాఖలు చేశారు.