Re-Opening Ceremony Of Amaravati : ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలగన్న ఒక స్వప్నం సాకారం కాబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమరావతిలో ఇవాళ రాజధాని పునఃనిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇవి కేవలం శంకుస్థాపలు కావని ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనాలని అన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి తానే శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు.