¡Sorpréndeme!

రామప్ప ఆలయంలో మిస్ ఇండియా - ప్రత్యేక పూజలు చేసిన నందిని గుప్తా

2025-04-27 28 Dailymotion

Miss India Nandini Gupta Visited Ramappa Temple : యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయాన్ని 2023 మిస్ ఇండియా విజేత నందిని గుప్తా శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. నందిని గుప్తా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ నేతృత్వంలో టూరిజం గైడ్లు ఆమెకు రామప్ప ఆలయ చరిత్ర, రామప్పలోని మదనిక సాలబంజికల చరిత్రను వివరించారు. అద్భుత నిర్మాణ రీతులు, అపురూప శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం జగద్విఖ్యాతం, కాకతీయుల నిర్మాణాల్లో తలమానికం.