AP Liquor Scam Updates : వైఎస్సార్సీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో మరికొన్ని సంచలనాలు బయటికొచ్చాయి. లిక్కర్ సిండికేట్ మూలవిరాట్ వైఎస్ జగనేనని సిట్ ఉద్ఘాటించింది. జే బ్రాండ్లు ఉత్పత్తి చేసిన ఎస్పీవై ఆగ్రో, అదాన్ డిస్టిలరీస్‌కు అరబిందో గ్రూప్ ద్వారా జగనే రుణాలు ఇప్పించినట్లు స్పష్టం చేసింది. దానికి ముడుపులు చెల్లించాలనే షరతులు పెట్టినట్లు వెల్లడించింది. అరబిందో గ్రూప్‌నకు ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఖాతా నుంచి ప్రతి నెలా కోటి చొప్పున రూటింగ్ చేసినట్లు సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది.