MLA Somireddy Chandramohan Reddy on Liquor Scam : మద్యం కుంభకోణంలో అసలు బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలని మాజీమంత్రి, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ దురాశ వల్లే నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని రంగంలోకి దింపాలని కోరారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి, మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ. 3200కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందన్న ఆయన, అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయన్నారు.