Actress Meenakshi Chaudhary Visited Tirumala : తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి ఇవాళ తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మీనాక్షి చౌదరికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది.