¡Sorpréndeme!

పోలీసులు గీత దాటారు - లగచర్ల ఘటనపై NHRC కీలక నివేదిక

2025-04-22 7 Dailymotion

NHRC Report on Lagacharla Incident : వికారాబాద్‌ జిల్లా లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదు. వారు గీత దాటి వ్యవహరించారు. గ్రామస్థుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది. ప్రజా సేవకులైన పోలీసు అధికారులు, జిల్లా అధికారులు బాధిత గ్రామ ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నా, వారు భూసేకరణ ప్రక్రియను సున్నితంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తు బృందం స్పష్టం చేసింది.