Gaddar Film Awards 2025 : దశాబ్దకాలంగా ఎలాంటి ప్రోత్సహకాలు, అవార్డులకు నోచుకోని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. గద్దర్ పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇవ్వడానికి అనేక కారణాలున్నాయన్న భట్టి తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమేనన్నారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సమక్షంలో జ్యూరీ ఛైర్మన్ జయసుధకు అందజేశారు.