Rescue Operations in the Danger Zone of The SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. డేంజర్ జోన్‌గా పరిగణిస్తున్న చివరి 50 మీటర్లలో అనుసరించాల్సిన విధానంపై కసరత్తు జరుగుతోంది. అక్కడ సహాయక చర్యలు చేపడితే ప్రమాదమన్న హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి సారించింది. జీఎస్‌ఐ సూచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకోనుంది.