¡Sorpréndeme!

రాష్ట్రానికి రూ.29 వేల కోట్ల పెట్టుబడులు - 19 వేల మందికి కొత్త ఉద్యోగాలు

2025-04-17 0 Dailymotion

Telangana New Investments : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రానికి మరో రెండు కీలక పెట్టుబడులు వచ్చాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో రెండు కంపెనీలు రూ. 29వేల కోట్లలతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు టీజీ రెడ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 27వేల కోట్లతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో 3,279 మెగావాట్ల వాయు, సౌర హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.

అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏడుచోట్ల 1,650 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. జోగులాంబ గద్వాలజిల్లాలో 650 మెగావాట్ల గ్రౌండ్‌మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టునుఏర్పాటు చేయనుంది. ఆ మూడు ప్రాజెక్టులతో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ద్వారా 16,200 మందికి ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి ఏటా రూ.1600 కోట్ల జీఎస్టీ రానుందని ప్రభుత్వం తెలిపింది. నున్న 25 ఏళ్లలో 400 మిలియన్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని అంచనా వేస్తోంది.

రాష్ట్రంలోని 15చోట్ల G.P.S.R ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్‌డ్‌ రూ. 2000 వేల కోట్లతో బయోగ్యాస్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌, టొరెంటో, మేఘాగ్యాస్ కంపెనీలతో కలిసి రోజుకు 15 టన్నుల సామర్థ్యంతో నెలకొల్పేందుకు టీజీ రెడ్కోతో ఎంవోయూ కుదుర్చుకుంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్‌లో ఆ ప్రాజెక్టులు రానున్నాయి.