CM Revanth Reddy Serious at CLP Meeting : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో సీరియస్ అయ్యారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో సీఎం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ముందు మాట్లాడారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు.