Anakapalli District SP press Meet on Fireworks Blast Incident : అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులు కోరుకుంటున్నారని ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు కోటవరట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతి చెందిన ఎనిమిది మంది మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బాణాసంచా తయారీ కేంద్రాలపై జిల్లా వ్యాప్తంగా సమగ్ర నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి సంబంధించి వచ్చే ఏడాది వరకు అనుమతులు ఉన్నాయని అయినప్పటికీ పరిశీలన చేస్తున్నామని ఆయన వివరించారు.