Police Have Cracked Sensational Murder Case Of Businessman : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపిన వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో మార్చి 26వ తేదీన జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం, పోలవరం మండలం పెద్దవం గ్రామంలో సచివాలయ సర్వేయర్‌గా చేస్తున్న శ్రీనివాస్ అదే ప్రాతంలో ఉంటున్న వ్యాపారి పెండ్యాల ప్రభాకర్ వద్ద గత ఏడాది డిసెంబర్లో రూ. 24,0000 అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చాలని కొంతకాలంగా వ్యాపారి శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయితే బెట్టింగులు, తదితర వ్యసనాలకు అలవాటు పడిన శ్రీనివాస్ అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఎలాగైనా ప్రభాకర్‌ను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అప్పు తీర్చవలసిన అవసరం లేదని భావించాడు.