Capital Amaravati Expansion: ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మరో 30 వేల ఎకరాల మేర సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటు అయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూసమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కోర్ క్యాపిటల్‌కు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు చేస్తోంది.