IRCTC Bharat Gaurav Tourist Trains: సుదూరప్రాంతాల్లోని ప్రఖ్యాత తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? దేశంలో పుణ్యక్షేత్రాలు, అక్కడ వెలిసిన దేవుళ్లను దర్శించుకోవాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. భారత్ గౌరవ్ యాత్ర పేరిట తక్కువ ఖర్చుతో, సకల సదుపాయాలతో దర్శించుకునేలా అద్భుతమైన ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు. వేసవిరాకతో రైళ్లలో క్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు పోటీ పడుతున్నారు. భారత్ గౌరవ్ రైళ్లు ఎక్కడెక్కడికి నడుస్తున్నాయి. వాటిలో సదుపాయాలేంటనే అంశాలపై ప్రత్యేక కథనం.