IMD Rain Alert to Telangana : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. రాగల మూడు రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని వివరించారు.