Kollu Ravindra Fires on YS Jagan : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం కొనుగోళ్ల అక్రమాలన్నీ వెలికితీస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేశామన్నారు. గత సర్కార్ పది మద్యం డిపోల ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.23,000ల కోట్ల రుణం తీసుకుందని ఆరోపించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ లిక్కర్ అరికట్టడంతో 40 శాతం అమ్మకాలు పెరిగాయని తెలిపారు. అనంతపురంలో మద్యం గోదాం, జిల్లా ఎక్సైజ్ శాఖ పరిపాలన భవనం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.