2013 ఫిబ్రవరి 2 ఈ తేదీ హైదరాబాద్ వాసులకు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ రోజు దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రదాడి జరిగింది. వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ వరుస పేలుళ్ల ఘటనలో మొత్తం 18 మంది మృతి చెందగా, మరో 131 మంది గాయపడ్డారు. దీంతో హైదరాబాద్‌తో పాటు దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన జరిగి సరిగ్గా పదేళ్ల క్రితం జరిగింది. అయితే ఇప్పుడు ఈ దిల్సుఖ్నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016లో ఉరి శిక్ష విధించగా వారు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది.