Gold Theft Update at SBI Branch in Warangal : వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లే. అవసరాల నిమిత్తం బంగారాన్ని బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. ఆ తరవాత బ్యాంకులో చోరీ జరిగింది. దొంగతనం జరిగి ఐదు నెలలు దాటినా పూర్తి స్ధాయిలో ఆభరణాల రికవరీ జరగలేదు. ఇక మా బంగారం కానీ డబ్బులు కానీ మాకివ్వండంటే బ్యాంకు అధికారులు రేపు మాపు అంటూ తిప్పిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.