Bandi Sanjay Fire On Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోదీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెప్పినా అవి ప్రధాని నరేంద్ర మోదీ బియ్యమే అని చెప్పారు.