మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఈరోజు పండుగే. దీనికి రీజన్ దాదాపు రెండేళ్ల తర్వాత ధోని కెప్టెన్సీ చేయనున్నాడు. అదేంటీ ధోని అన్ని రుతురాజ్ కు వదిలేశాడు కదా మళ్లీ ఏంటీ అంటే రుతురాజ్ కు నెట్ ప్రాక్టీస్ లో గాయమైంది. సో మధ్యాహ్నమే మ్యాచ్ కాబట్టి అప్పటి లోపు కోలుకోవటం కష్టమైతే రుతురాజ్ ఓ మ్యాచ్ విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అదే జరిగితే ధోని కెప్టెన్ గా సీఎస్కే ను లీడ్ చేస్తాడు. 29 మే 2023 ధోని కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ చేశాడు. ఆరోజు జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో జడేజా మ్యాజిక్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ సంపాదించేలా చేశాడు.