Genco Appointment Letter Ceremony : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని, వారి ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు ప్రభుత్వం టీఎస్ జెన్‌కోలో ఉద్యోగాలను కల్పించింది. వాటికి సంబంధించిన నియామక పత్రాలను మాదాపూర్‌లోని సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థులకు భట్టి విక్రమార్క అందజేశారు.