Paritala Sunitha Fires on YS Jagan : తన భర్త పరిటాల రవీంద్ర హత్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. ఆ కేసులో జగన్‌నూ సీబీఐ విచారించిందని చెప్పారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన చిన్న ఘటనను ఫ్యాక్షన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఫ్యాక్షన్ కారణంగా పరిటాల, గంగుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. ఈ మూడు కుటుంబాలు చాలా కోల్పోయాయన్నారు. అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.