ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ లో అదిరిపోయే మ్యాచ్ అదే. కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ లో 300 కొట్టడమే టార్గెట్ గా బరిలోకి దిగిన సన్ రైజర్స్..మొదటి మ్యాచులో రికార్డు స్కోరు క్రియేట్ చేసినా రెండు మూడు మ్యాచుల్లో ఓటమితో కాస్త నిరుత్సాహంలో ఉంది. కావ్యాపాప డల్ ఫేస్ పెట్టుకుని కూర్చుంటే ఉన్నంత దిగాలుగా ఉన్న సన్ రైజర్స్ టీమ్ లో జోష్ రావాలంటే ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో వేట మాములుగా ఉండదు. ఈ సీజన్ లో మూడో మ్యాచులు ఆడిన సన్ రైజర్స్, కోల్ కతా ఒకటి మాత్రమే గెలిచి..రెండింటిలో ఓడిపోయాయి. కావాల్సినంత టాలెంట్, పొటెన్షియల్ ఉండి ఎందుకో వర్కవుట్ కాని సిచ్యుయేషన్స్ లో పడిపోతూ తెగ ఇబ్బంది పడుతున్నాయి సన్ రైజర్స్ ,కోల్ కతా రెండు టీమ్స్ కూడా. ఇక బలాబలాలు చూస్తే సన్ రైజర్స్ బలం బలహీనత అన్నీ బ్యాటింగే. వాళ్లు ఆడితే 300 టీమ్ స్కోరు కూడా బద్ధలు అవటం ఖాయం అనిపిస్తోంది. లేదంటే అస్సలు ఊహించని రీతిలో కుప్పకూలిపోతున్నారు ఆరెంజ్ ఆర్మీ వీరులు. సో రేపు ఈడెన్ లో అభిషేక్ శర్మ, హెడ్ నుంచి విధ్వంసకర ఓపెనింగ్ ను ఎక్స్పెప్ట్ చేస్తోంది సన్ రైజర్స్ జట్టు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా ఎంత చూసినా సన్ రైజర్స్ బ్యాటింగ్ ఉన్నంత బలంగా మరే టీమ్ కూడా లేదనిపిస్తోంది. బౌలింగ్ కూడా అంతే కమిన్స్ కి తోడుగా షమీ..స్పిన్ లో జంపాకు తోడుగా జీషన్ అన్సారీ మళ్లీ ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉంది. కోల్ కతా కూడా సేమ్ నరైన్ నుంచి రసెల్ వరకూ దుర్భేద్యంగా ఉండే టీమ్ లో రహానే, రమణ్ దీప్ లాంటి వాళ్లు మిగిలిన వాళ్లు పెద్ద టచ్ లో కనిపించట్లేదు. డికాక్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ లైన్లోకి వస్తే తప్ప కేకేఆర్ కు ఈసారి వర్కవుట్ అయ్యేలా అనిపించట్లేదు. చూడాలి ఈ మాజీ ఛాంపియన్ల పోరాటంలో చారిత్రక ఈడెన్ గార్డ్సెన్స్ లో గెలుపు సంతకం ఎవరిదో.