¡Sorpréndeme!

తెలంగాణకు చల్లటి కబురు - ఐదు రోజుల పాటు తేలికపాటి

2025-04-01 0 Dailymotion

Light to Moderate Rains in Telangana : మండుతున్న ఎండలతో ఉక్కపోత కారణంగా సతమతమవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురందించింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం, గురువారం ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి