మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మొకాల్లాపెళ్లిలో....మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజ రాము 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ విమలక్క పాల్గొని కుంజ రాము చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో పలువురు వక్తలు కామ్రెడ్ రాము చేసిన పోరాటాలు ఆయన ఆశయాలను స్మరిస్తూ మాట్లాడారు.
కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సీడీని సీతక్క విమలక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు. విమలక్క మాట్లాడుతూ... అమరవీరులను స్మరిస్తూ విమలక్క భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సీతక్క విమలక్కను ఆలింగనం చేసుకొని తన భర్త కామ్రేడ్ కుంజా రాముని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.