CM Chandrababu Polavaram Visit: పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని గుర్తుచేశారు. రైతులకు మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్న ఆయన, నిన్న మొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు. పోలవరం పూర్తి కోసం ఏడు మండలాలు ఏపీలో కలపాలని అప్పట్లో మోదీని డిమాండ్ చేశానని గుర్తుచేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 లక్షలు పరిహారం ఇస్తానన్నారన్న సీఎం, జగన్ అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని ఆరోపించారు.