TTD Chairman BR Naidu On Board Resolutions : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని వివరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. టీటీడీ బోర్డు తీర్మానాలను వివరించారు.