Betting Apps Case Updates : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో తెలంగాణ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరిని విచారించారు.