Anchor Shyamala Attends police interrogation : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం కేసులో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్యామలను పోలీసులు సుమారు మూడు గంటల పాటు విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా శ్యామల తెలిపారు.