Bhadrachalam Town Likely To Face Flood Threat : భద్రాచలం వాసులకు ఈసారీ వరద ముంపు తప్పేలా కనిపించడం లేదు. గతేడాది గోదావరి ఉగ్రరూపంతో కట్టుబట్టలతో తరలి వెళ్లిన ప్రజలు మళ్లీ అవే కష్టాలు అనుభవించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. వరదపోటు నుంచి కాపాడేందుకు చేపట్టిన కరకట్ట నిర్మాణం పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. అధికారుల సమన్వయ లోపం, ఆర్థిక ప్రతిబంధకాలు కారణమేదైనా పనులు అసంపూర్తిగానే దర్శనిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిదంటే చాలు భద్రాచలం పట్టణవాసులకు కంటిమీద కునుకు ఉండదు. ఏటా జూలై, ఆగస్టులో విరుచుకుపడే గోదావరి వరదలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. కట్టుబట్టలతో శిబిరాలకు తరలివెళ్లాల్సిన దుస్థితి.