EX MINISTER BEHIND AVANIGADDA DRUGS SALES: అవనిగడ్డ భార్గవ మెడికల్స్‌లో ఈగల్ టీం పట్టుకున్న అతి ప్రమాదకరమైన ఔషధాల వెనక వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రికి సంబంధం ఉందని టీడీపీ ఆరోపించింది. షాపు యజమాని కొనకళ్ల రామ్మోహన్, ఆయన సోదరుడికి మాజీమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. మాజీమంత్రికి నోటీసులు ఇచ్చి విచారించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.