¡Sorpréndeme!

కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం - ఎక్కడో తెలుసా?

2025-03-21 2 Dailymotion

One Rupee Lunch : ఆకలితో ఉన్నవాళ్ల ఆర్తిని తీర్చడం కంటే మంచిపని ఇంకోటి ఉండదు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చే వలస కార్మికులు, దినసరి కూలీలు ఎవరైనా సరే సికింద్రాబాద్ ప్రాంతంలో సరిగ్గా మధ్యాహ్నం 12 కాగానే అక్కడకి చేరుకుంటారు. ఆకలి తీర్చుకుని తిరిగి పనులకు వెళ్తుంటారు. ఇంతకీ వాళ్లందరి ఆకలి తీరుస్తున్నది ఎవరో ? ఒకసారి చూద్దాం.

సికింద్రాబాద్ మనోహర్ టాకీస్ సమీపంలో కరుణ కిచెన్ ఆ పేరు అక్కడి కార్మికులకు గత నెలన్నర రోజులగా సుపరిచితం. కేవలం ఒక రూపాయికే భోజనం అందిస్తూ గుడ్ సమ్మరిటీస్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ దాతృత్వాన్ని చాటుకుంటోంది. జార్జ్‌ రాకేష్ బాబు ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అందరిలా వ్యాపారం చేస్తే ఏం ప్రత్యేకత ఏముంటుందనుకొని నగరానికి వచ్చే వారి ఆకలి తీర్చాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఒక్కరూపాయికే భోజనం అందిస్తున్నారు.