Telangana CM Revanth Reddy Speech : సీఎం పదవి చేపట్టడం కన్నా జడ్పీటీసీగా గెలిచినప్పుడే ఎక్కువ ఆనందం కలిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 'ప్రజాపాలనలో కొలువుల పండగ' కార్యక్రమంలో పాల్గొని 'బిల్డ్ నౌ పోర్టల్'ను ఆయన ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.