Hydraa Visits Gangaram Tank : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధి చందానగర్‌లోని గంగారం పెద్ద చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గంగారం పెద్ద చెరువు కబ్జాకు గురైందని హైడ్రాకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఫిర్యాదు చేయడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువులో మట్టి నింపుతున్న ప్రాంతాలను రంగనాథ్ పరిశీలించారు. చెరువులో మట్టి నింపుతున్న వారిపై ఇప్పటికే కేసులు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యాక చెరువులో మట్టి నింపిన వారిపై తామే నేరుగా కేసులు పెడతామని రంగనాథ్ వివరించారు.