¡Sorpréndeme!

తిరుమల శ్రీవారి భక్తులకు పార్కింగ్​ కష్టాలు

2025-03-20 1 Dailymotion

Huge Traffic Jam At Thirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు తమ వాహనాల పార్కింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సొంత వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలతో కొండపైకి వస్తుంటే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేవని చెబుతున్నారు. తిరుమలలో వాహనాలు నిలిపేందుకు నిర్దేశిత స్థలాలు తగినంత లేకపోవడంతో సమస్యగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి, తిరుమలలో మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణం కోసం ప్రణాళికలు చేపట్టినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తిరుమల విజన్‌ 2047లో భాగంగా పార్కింగ్ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.