Malla Reddy 49th Wedding Anniversary Celebrations : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవంలో డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుధవారం ఎమ్మెల్యే దంపతుల 49వ వివాహ వార్షికోత్సవం తమ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి, కల్పన దంపతులు డాన్స్ చేస్తూ సందడిగా గడిపారు. కేక్ కట్ చేశారు. కార్యకర్తలు, అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారిపై పూల వర్షం కురిపించారు.