Hundred Years Old Houses In HanumanthaRaopeta : ఆ కట్టడాలు వంద సంవత్సరాలు పూర్తి అయినా చెక్కుచెదర లేదు. కనీసం రాయి కదలలేదు, ఇసుక రాలలేదు. వంద సంవత్సరాల క్రితమే అంతటి టెక్నాలజీతో కేవలం కొండరాళ్లను ఉపయోగించి రెండు అంతస్తుల భవనాలను నిర్మించారు. ఇసుక, సిమెంట్ అసలే వాడలేదు. డంకు సున్నాన్ని అతి తక్కువ మోతాదులో వాడి ఇళ్లు నిర్మించారు. ఎండాకాలంలో చల్లగా వాన కాలంలో వెచ్చగా ఇళ్లు తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. ఇంతకీ ఎక్కడ ఆ ప్రాంతం? ఎంటీ ఆ ఇళ్లు? అని తెలుసుకోవాలంటే తప్పని సరిగా ఈ కథనం చూడాల్సిందే.
కొండరాళ్లతోనే రెండు అంతస్తుల భవనాలు నిర్మాణం : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని హన్మంతరావు పేటలో అతి పురాతనమైన దాదాపు 150 సంవత్సరాల నాటి ఇళ్లు నేటికి చెక్కుచెదరలేదు. అక్కడక్కడ కొన్ని ఇళ్లు పైకప్పులు కొంత ఇరిగిపోవడంతో ఇంటి యజమానులే మరామ్మతులు చెసుకుంటున్నారు. ఎందుకంటే ఆ నాటి కట్టడాలను ప్రస్తుత తరంవారికి అర్థంకావు కాబట్టి. ఈ ఇళ్లకు కేవలం వేప, టేకు కలపను ఉపయోగిస్తున్నారు. జిగురుగా ఉన్న నల్లమట్టిని మాత్రమే ఉపయోగించి పైకప్పులకు మరమ్మతులు చేస్తున్నారు. ఇంటి గోడలకు కొండరాళ్లు వినియోగించారు. కొండరాళ్లతోనే రెండు అంతస్తుల భవనాలు నిర్మాణించారు. ఇవి ఒక్కోటి దాదాపు 20 నుంచి 50 కిలోల బరువు ఉంటాయి. వంద సంవత్సరాల క్రితం వాటిని పైకి ఎత్తడానికి ఎటువంటి యంత్రాలు పల్లేటూర్లలోకి రాలేదని, కేవలం మనుషులే వాటిని ఎత్తుకు వెళ్లి గోడలు నిర్మించారని గ్రామ ప్రజలు చెబుతున్నారు.