Miss World Krystyna Pyszkova : యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని మిస్ వరల్డ్ ఆలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఆమెకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించారు. మిస్ యూనివర్స్‌కి స్వామి వారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు అందజేశారు.