ST,SC Atrocities Case Filed Against MLA Sudheer Reddy : ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను కులం పేరుతో దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు ఆమె తెలిపారు. గన్‌పార్క్ వద్దకు చేరుకున్న ఆమె ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కులం పేరుతో గత కొన్నేళ్లుగా అవమానించి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని తాజాగా తనను హనీమూన్ అనే పదంతో దూషించారని తీవ్ర ఆరోపణలు చేశారు.