Products Made by DWCRA Women Available Online : వైఎస్సార్సీపీ హయాంలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు పునరుత్తేజం ఇస్తూ మహిళల్ని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నడిపే మహిళలకు సున్నావడ్డీ రుణాలతోపాటు వారు తయారు చేస్తున్న ఆహార, ఆరోగ్య, అలంకరణ, వస్త్ర, వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో ప్రత్యేక ఆన్‌లైన్ వేదిక ద్వారా స్వయం సహాయక మహిళా బృందాల ఉత్పత్తుల్ని వినియోగదారులకు చేరువ చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.