Chemical Attack Video Viral : సైదాబాద్ భూలక్ష్మీ మాత ఆలయంలో ఓ ఉద్యోగిపై గుర్తు తెలియన వ్యక్తి రసాయనం చల్లి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుడు ఆలయానికి వచ్చి అకౌంటెంట్ నర్సింగ్‌రావు అలియాస్ గోపిని వివరాలు అడుగుతున్నట్లు కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. నర్సింగ్‌రావు కూర్చుని ఉండగా అతడి తలపై నిందితుడు రసాయనపు పౌడర్ చల్లి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.