Ramadan Attar Perfumes in Hyderabad : పవిత్ర రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తున్నాయి. విభిన్న పరిమళాలు , ప్రత్యేకతలు కలిగిన అత్తర్లకు భాగ్యనగరం పెట్టింది పేరు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే కొనుగోలుదారులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. రంజాన్ మాసంలో ముస్లింలు విరివిగా ఉపయోగించే అత్తర్ల సీసాలు కొత్త పరిమాణాలతో కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.