అమరావతి రైతులు చేసిన ఉద్యమం చరిత్రలో ఇప్పటివరూ చూడలేదని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వెలగపూడిలో అమరావతి రైతులతో ఆయన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమైనందుకు మంగళగిరిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15న జరిగే శ్రీనివాస కళ్యాణంలో రైతులంతా పాల్గొనాలని కోరారు.