Court Verdict On Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2 అయిన సుభాష్ శర్మకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్‌తో యువకుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, 8 మందిని నిందితులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా, ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.