Cricket Betting Gang Arrested In Bhimavaram Of East Godavari District : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టు చూపుతూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా ఆదివారం జరిగిన ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో భీమవరంలోని నరసయ్య ఆగ్రహంలో ఒక ఇంటిపై దాడి చేయగా నలుగురు క్రికెట్ బెట్టింగ్ బుకీలు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.13 లక్షల విలువైన 54 సెల్ ఫోన్లు, మూడు లాప్‌టాప్‌లు, రెండు ఇంటర్నెట్ రోటర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.